పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ తన పెండింగ్ సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతునన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత, కొంత సమయం తీసుకొని తను సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. జూలై 24న హరి హర వీరమల్లు: పార్ట్ 1 విడుదలై, ఆశించిన ఫలితాలను అందుకున్నప్పటికి. దీంతో అభిమానులు త్వరలో రాబోయే OG సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్, పోస్టర్లు, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన మొదటి పాట సెన్సేషన్ క్రియేట్ చేయగా.
Also Read : Sreeleela : రాత్రులు అలా చేస్తుంటాను.. అందుకే ఒక్కదాన్ని పడుకోలేను
ఇప్పుడు మేకర్స్ 2వ పాటను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక రొమాంటిక్ స్టిల్‌లో కనిపించారు. దీపాల కాంతుల్లో ఇద్దరూ ప్రకాశిస్తున్నారు. ఇక ఆ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ కుడి చేతిపై జపాన్ భాషలో మూడు పదాలు టాటూ రూపంలో ఉన్నాయి. వాటి అర్థం ఎంటా అని అభిమానులు తల కొట్టుకుంటున్నారు. అయితే సమాచారం ప్రకారం.. మొదటి అక్షరం: ప్రామిస్ (Promise), రెండో అక్షరం: బలం (Strength), మూడో అక్షరం: ఫైర్ (Fire) దీని అర్థం అంట. ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ పవర్‌ఫుల్ వర్డ్స్.. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కు ప్రత్యేకత, సెన్సేషన్‌ను ఇస్తున్నాయి.
