పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజి’ పై ప్రేక్షకులు ఫుల్ ఏగ్జేట్‌మెంట్ తో ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ముగింపుకు దగ్గరగా ఉండగా.. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇతర రాజకీయ, సినిమా కమిట్‌మెంట్స్ మధ్యలో టైమ్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఇంతవరకు వచ్చిన అప్‌డేట్స్‌ను బట్టి చూస్తే, ‘ఓజి’ టీమ్ ప్రచారంలో ఏ మాత్రం తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్‌ని పూర్తిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, థమన్ మ్యూజిక్ పరంగా మరోసారి తన మాస్ మాజిక్ చూపించినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా.. ఇపుడు కొత్త న్యూస్ వినిపిస్తుంది.
Also Read : Tamannaah : నయనతార, రష్మికల బాటలో తమన్నా – కొత్త వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్
ఈ ఆగస్టు 15కి మరో సాలిడ్ సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందట. టీజర్, మేకింగ్ వీడియో లేదా మరో సాంగ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్ మూడ్, స్టన్నింగ్ విజువల్స్‌ను ఈ సర్‌ప్రైజ్‌లో చూపించే అవకాశం ఉందని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ, ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మొదలైంది. అంతా కలిపి చూస్తే.. ‘ఓజి’ కంటెంట్ మాత్రమే కాదు, ప్రమోషన్ల పరంగా కూడా ఫ్యాన్స్‌కి పండగే అనిపించేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది!
