Site icon NTV Telugu

HHVM : అక్కడ అల్ట్రా డిజాస్టర్ దిశగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

Hhvm (4)

Hhvm (4)

ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’  మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి థియేటర్స్ లో అడుగుటపెట్టింది. ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండి ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండాఫ్ ను సరిగా డీల్ చేయలేదు అనే కామెంట్స్ వినిపించాయి.

Also Read : NTR 31: NTRNeel టైటిల్ కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

తెలుగురాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది హరిహర వీరమల్లు. ఇదిలా ఉండగా ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ అయింది హరిహర వీరమల్లు. అక్కడ కూడా స్పెషల్ ప్రీమియర్స్ నుండి ప్లాప్ టాక్ అందుకుంది. USA ప్రీమియర్స్ లో $802K తో భారీ స్టార్ట్ అందుకున్న వీరమల్లు బ్యాడ్ టాక్ తో మొదటి రెండవ రోజు నుండి కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. నార్త్ అమెరికాలో మొదటి రోజు కేవలం $111K మాత్రమే రాబట్టింది. ఇక రెండవ రోజు నిన్నటి రోజన 101లొకేషన్స్ కు గాను $15,741 మాత్రమే రాబట్టింది.USAలో $14,935 మరియు కెనడాలో $806 వసూలు చేసి ఓవర్సీస్ మార్కెట్ లో అల్ట్రా డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ దాదాపు రూ. 10 కోట్లకు దక్కించుకుంది. నేడు, రేపు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ లో జంప్ ఉంటుందేమో చూడాలి. పరిస్థితి ఇలానే ఉంటె ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ కు భారీ నష్టాలు తప్పవు.

note : ఈ కలెక్షన్స్ వివిధ మార్గాల ద్వారా సేకరించబడినవి.

Exit mobile version