Site icon NTV Telugu

Pawan Kalyan : లుక్స్, ఫిజిక్‌ పై వర్కవుట్స్ మొదలు పెట్టిన పవర్ స్టార్..?

Pavankalya

Pavankalya

టాలీవుడ్‌లో అపారమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి స్టార్ హీరోస్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలో ఆయనప్పటికీ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. అందుకే ఎంత మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా డే 1 బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేస్తుంది. కాగా ప్రజంట్ పవన్ వరుస చిత్రాలు లైన్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ సినిమాలకంటే ఫుల్ టైమ్ పోలిటిక్స్‌లో బిజీ అయ్యాడు. ప్రస్తుతం ప్రజల సేవలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్. కానీ తాజాగా వినపడుతున్న శుభవార్త ఏంటి అంటే..

Also Read : Chhaava: రెండో రోజు అధిరిపోయిన తెలుగు ‘ఛావా’ బుకింగ్స్

ముగిసిన మహా కుంభమేళాలో ఈ 45 రోజుల్లో సుమారు 60 కోట్లకు పైగా మంది భక్తులు స్నానమాచరించారు. కాగా ఈ పుణ్య స్నానం ఆచరించాడికి ఇప్పటి వరకు దాదాపు అందరు స్టార్ హీరోలు, హీరోయిన్‌లు, నటిటలు వెళ్ళారు. కాగా పవణ్ కల్యాణ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఈ పుణ్య స్నానమాచరించాడు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన లుక్స్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ నడిచింది. దీంతో పవన్ అభిమానులు ట్రోలర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేస్తున్న రాజకీయ సేవా కార్యక్రమాలు చూడకుండా.. పొట్టని మాత్రం గమనించి ట్రోల్ చేయడం సిగ్గు చేటు అంటూ పవన్ అభిమానులు ట్రోలర్స్ పై మండిపడ్డారు. దీంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ తన లుక్స్‌, ఫిజిక్‌ పై ఫోకస్ పెట్టి వర్కవుట్స్ మొదలు పెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version