Site icon NTV Telugu

Pawan Kalyan: తన సినిమాల నిర్మాతలతో పవన్ కీలక సమావేశం

Pawankalyan

Pawankalyan

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన వెన్నునొప్పితో బాధపడుతూ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చినందున, ప్రస్తుతానికి కుమారుడితో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఆయన ఇంకా నటించాల్సిన పోర్షన్స్ పెండింగ్ ఉండడంతో, ఎప్పుడు ఆ సినిమాలు పూర్తి చేస్తారా అని నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆయన నిన్న తన సినిమా నిర్మాతలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు.

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌పై ప్రతీకారానికి సిద్ధం.. ఇండియా ముందు ఉన్న దారులు ఇవే..

వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేస్తానని వారికి మాటిచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి మే నెలలో రిలీజ్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా కరోనా ముందు మొదలైంది, అనేక వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. దాంతోపాటు ఓజీ సినిమాని కూడా ఆయన పూర్తి చేయాల్సి ఉంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి వారికి కూడా జూలై నుంచి డేట్స్ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఏఎం రత్నం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు డివివి దానయ్యతో సమావేశమయ్యారు. తన చివరి చిత్రం వస్తాద్ భగత్ సింగ్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version