Surender Reddy-Pawan Kalyan: పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి మూవీ.. హీరోయిన్ ఎవరు?

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమా
  • పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసిన సురేందర్ రెడ్డి
  • పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరు?
Imaanvi Pawan Kalyan

Imaanvi Pawan Kalyan

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఇప్పటికే సురేందర్ రెడ్డి పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్టుగా సమాచారం. 2026 ఉగాది రోజున ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించబోతున్నారు. పవన్ డేట్స్‌ను బట్టి షెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు మేకర్స్. అలాగే ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ నేపద్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ కోసం పర్ఫెక్ట్ జోడీని సెట్ పనిలో ఉన్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సినిమా స్కేల్‌కు తగ్గట్టుగా, కథకు సరిపడే నటి కోసం ఎంపిక ప్రక్రియ సాగిస్తున్నారని సమాచారం. అందుకే హీరోయిన్ ఖరారులో కొంత ఆలస్యం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలో రష్మిక మందన్న లాంటి పాన్ ఇండియా బ్యూటీ పేరు వినిపించగా.. ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది.

Also Read: T20 World Cup Records: వరల్డ్‌కప్‌లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్‌లో పాకిస్థాన్‌కు చోటు!

ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాతో ఇమాన్వీ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన ఈ అమ్మడిని తీసుకుంటే బాగుంటుంద‌నే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతానికైతే.. పవన్ సరసన ఎవరు ఫైనల్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫలానా బ్యూటీ అంటూ.. రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇమాన్వీ న్యూస్ నిజమైతే.. అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. అయితే ఇలాంటి విషయల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.