ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో మళ్లీ జాయిన్ అయ్యారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
Also Read : Bigg Boss Telugu 9: మరికాసేపట్లో బిగ్ బాస్.. లోపలికి వెళ్లిన వారెవరంటే?
ప్రస్తుతానికి ఈ సాంగ్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది సినిమా టీం. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమాని తమిళ ‘తేరి’ రీమేక్‌గా రూపొందించాలని ప్రారంభించినా, తర్వాత పవన్ కళ్యాణ్ సూచనలతో ఈ సినిమా కథను పూర్తిగా మార్చేశాడు హరీష్ శంకర్. ఇప్పుడు పూర్తిగా ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.
