Site icon NTV Telugu

Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..?

Untitled Design (7)

Untitled Design (7)

పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు రానున్న.సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది.కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా సినిమాలు కాస్త బ్రేక్ ఇచ్చాడు. దీంతో పలు సినిమాలు  మధ్యలోనే ఆగిపోయాయి.

Also Read: Nani: దానయ్యకు ఏమి తెలియదు.. అన్ని నన్నే చూసుకోమంటారు: నేచురల్ స్టార్

ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని గతంలో పవన్ వ్యాఖ్యలు చేసాడు. ఎప్పుడెప్పుడు OG షూట్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను కలిశారు నిర్మాత DVV. దానయ్య. అయితే ఈ షూటింగ్ హైదరాబాద్ లో కాదని తెలిసింది. OG షూటింగ్ విఙయవాడలో చేసేలా ఏర్పాట్లు చేయమని నిర్మాతకు సూచించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. బహుశా సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి పవన్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ సమీక్షలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరొక భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమళ్లు. ఈ చిత్ర నిర్మాత AM. రత్నం కూడా పవన్  ను కలిశారు. కానీ ముందు OG పూర్తి చేశాకే తర్వాత సినిమాకు డేట్స్ ఇస్తానని అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version