పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఆయన అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఏదో చూసే చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఓజి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ప్రస్తావించబడుతున్న ఈ చిత్రాన్ని సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తూ డివివి దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే విషయం మీద అభిమానులు అందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. తాజాగా నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ నిర్మాతల సమావేశంలో ఈ సినిమాకి సంబంధించిన డేట్స్ కూడా తాను ఇస్తానని వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని సుజిత్‌ని కోరినట్లుగా తెలుస్తోంది.
Pawan Kalyan: తన సినిమాల నిర్మాతలతో పవన్ కీలక సమావేశం
ఇక ఇన్‌సైడ్ వర్గాల సమాచారం మేరకు ఈ ఓ జిసినిమాని సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. మరోపక్క హరిహర వీరమల్లు చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఇంకా చాలా డేట్స్ కేటాయించాల్సి ఉండడంతో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తన చివరి చిత్రంగా ఉండబోతుందని పవన్ కళ్యాణ్ నిన్న నిర్మాతల సమావేశంలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
