Site icon NTV Telugu

Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ తర్వాత పవన్‌ సినిమా ఏంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. సాధారణంగా, పవన్ కల్యాణ్ ఒక ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? ఆయన డేట్స్ కోసం లైన్‌లో ఉన్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు? ఎవరికి ముందుగా ఛాన్స్ దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం.

Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. ముందే మైండ్లను రెడీ చేస్తున్నాడుగా

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ కోసం ఇద్దరు ప్రముఖ నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల క్రితమే రామ్ తళ్లూరి నిర్మాణంలో సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా తెరపైకి వచ్చిన మరో నిర్మాత విశ్వప్రసాద్. ఈయన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రిలీజ్‌కు హెల్ప్ చేసిన నిర్మాత. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ విశ్వప్రసాద్‌కు ఛాన్స్ ఇస్తాడా, లేక ముందుగా కమిట్ అయిన రామ్ తళ్లూరి సినిమాను ప్రారంభిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read :Akhanda 2: షాకింగ్.. అఖండ 2 రిలీజ్ 12న కూడా లేనట్టేనా?

పవన్ కల్యాణ్‌కు ‘హరిహర వీరమల్లు’ సినిమా ఒక పెద్ద పాఠమే నేర్పింది. ఈ చిత్రం ఐదేళ్లపాటు నిర్మాణంలో ఉండడం వలన బడ్జెట్‌ పెరిగిపోయింది. దీంతో రిలీజ్‌కు ఆటంకం ఏర్పడింది, ఆఖరికి హీరో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవంతో, పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాల విషయంలో ‘ఓజీ’ స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను 40 నుండి 50 రోజుల కాల్షీట్స్‌తో తన క్యారెక్టర్‌ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంటే, సినిమా నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూసుకోవడం అన్నమాట. మొత్తంగా, త్వరలోనే పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్ర నిర్మాత ఎవరో, ఏ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version