NTV Telugu Site icon

Pawan Kalyan: టికెట్ రేట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలంటే అది డిమాండ్ అండ్ సప్లై. నేను చెన్నైలో శంకర్ గారు సినిమా బ్లాక్ లో టికెట్ కొనుక్కొని చూశాను. నా సరదా అది. నాకు ఇచ్చిన పాకెట్ మనీతో నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు బడ్జెట్లు పెరిగాయి. మన సినిమా విశ్వవ్యాప్తమైంది, బడ్జెట్‌ పెరిగిపోతోంది.. టికెట్‌ ధరలు పెంచక తప్పని పరిస్థితి.. డిమాండ్‌ సప్లయ్‌ ఆధారంగా టికెట్‌ రేట్ పెంచుకోవడంలో తప్పులేదు అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టి కడుతున్నారు. పెరిగిన ప్రతి టికెట్ రేటుకు గవర్నమెంట్ కి టాక్స్ వస్తోంది. ఇదేమీ ఊరికే ఇవ్వడం లేదు ప్రభుత్వం. దీనిమీద బయట ఒక దుష్ప్రచారం ఉంది. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచలేదు, పెంచకపోగా తగ్గించారు. ఇప్పుడు చాలామంది హీరోలు ఎవరు కూటమికి మద్దతు పలకలేదు. అందరూ బాగుండాలని కోరుకుంటాం అందుకే మేము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.

Pawan Kalyan :చరణ్ ఏడేళ్ల వయసులో చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు!

అందుకే దిల్ రాజు కూడా చెప్పాను చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగ పూలమడం మాకు కూడా ఇష్టం లేదు. ఎన్డీఏ కూటమికి నేను చెందిన వ్యక్తిని అయినా జనసేన అధినేతను అయినా సినిమా అనేది ఒక వ్యవస్థ గానే ట్రీట్ చేయాలి. సినిమా వ్యవస్థలోకి పొలిటికల్ వ్యవస్థ ఎంటర్ కాకూడదు. సినిమా టికెట్ రేట్లు పెంపు కోసం హీరోలు రావద్దు, నిర్మాతలు రండి. మేము ఆ పెంపు ఇచ్చేస్తాం. హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అని అనుకునే అంత లో లెవెల్ వ్యక్తులం మేము కాదు. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అంటే స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు ఆయనను ఎంత మంది విమర్శించినా కోట శ్రీనివాసరావు గారు లాంటివాళ్ళు విమర్శించినా తనతో పాటు నటించినప్పుడు ఏం బ్రదర్ బాగున్నారా అని పలకరించేవారు. ఆయన అంతటి మహానుభావుడు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. ఎన్టీ రామారావు గారి సైతం ఎప్పుడూ వివక్ష చూపించలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Show comments