OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?

Og 2

Og 2

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో బర్త్‌డే రోజు ‘OG 2’ సర్ ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. సుజీత్ ఒక పవర్‌ఫుల్ యానిమేటెడ్ వీడియో రెడీ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ వర్గాల్లో నడిచింది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక శబ్దం లేకపోవడం విశేషం. అటు పవర్ స్టార్ కూడా భుజం గాయం కారణంగా ఆయుర్వేదం చికిత్స నిమిత్తం కేరళలో ఉన్నారు. సో బర్త్‌డే సందర్బంగా పెద్ద వీడియో కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పుట్టినరోజుకి పోస్టర్ లేదా గ్లింప్స్ ఇచ్చినా షూటింగ్ మాత్రం ఇప్పుడే ఆశించలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ఎలాంటి బర్త్‌డే సర్ ప్రైజ్ రానుందో చూడాలి.