Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు.
చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చివరగా “మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి తన తమ్ముడికి ప్రేమతో బర్త్‌డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ప్రత్యేక పోస్ట్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..