ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లడ్డూ వివాదం కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నియమ నిష్ఠలతో స్వామి వారి నామం స్మరిస్తూ భక్తి మార్గంలో నడుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బెజవాడ కనకదుర్గ అమ్మవారి గుడి మెట్లు శుభ్రం చేసి స్వయంగా మెట్ల పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం గుండా సామాన్య భక్తులతో కలిసి కాలినడకన తిరుమల కొండ పైకి చేరుకున్నారు. మార్గ మద్యంలో మోకాలి పర్వతం వద్ద మోకాళ్లపై మెట్లకు ప్రణమిల్లుతూ, మోకాలి పర్వతానికి సాష్టాంగ ప్రణమిల్లి, భక్తి భావంతో నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు పవన్ కళ్యాణ్.
Also Read : Pavan Kalyan : దేవర కారణంగా భారీ ధర పలుకుతున్న OG థియేట్రికల్ రైట్స్..?
కాగా నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నేడు ఉదయం వరాహ స్వామి వారిని దర్శించుకుని పిమ్మట తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. స్వామి దర్శనం అనంతరం పవన్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించునున్నారు . ఆ తర్వాత నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం సముదాయానికి చేరుకోనున్నారు పవన్. భోజనశాలలో అన్నప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి, అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాగా మెట్ల మార్గం తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ వెన్ను, మోకాలి నొప్పితో భాదపడుతున్నారు