Site icon NTV Telugu

Paramapada Sopanam: పూరి స్టయిల్లో ‘పరమపద సోపానం’ టీజర్

Paramapada Sopanam

Paramapada Sopanam

‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది ‘పరమపద సోపానం’. దీంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా విడుదల చేసిన ‘చిన్ని చిన్ని తప్పులేవో’ ‘భూమ్ భూమ్’ వంటి లిరికల్ సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ లాంచ్ వేడుకను కూడా గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర బృందం.

అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. ‘నేను ఒక ఫోటో షూట్లో ఉన్నప్పుడు శివ నాకు ఈ కథ చెప్పాడు. అతను చెబుతున్నప్పుడు.. హీరో ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో.. అవి నాకు పూరి గారి స్టైల్లో అనిపించేవి. అందుకే చాలా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శివ చాలా కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. నిర్మాత శివ ప్రసాద్ గారు కూడా అతని విజన్ కి సహకరించడం వల్లే ఔట్పుట్ బాగా వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.

Exit mobile version