NTV Telugu Site icon

Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు

బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో అప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోగా కప్పు గెలిచిన పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ వెనుక గేటు నుంచి బయటకు పంపించారు నిర్వాహకులు, ఇంటికి వెళ్లిపోమని చెబితే కప్పు గెలిచిన తాను దొంగ దారిలో వెళ్లిపోవడం ఏంటి అని భావించి పల్లవి ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చాడు.

Also Read: Salaar Overseas: 2 మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్… ఆగ్ లగా దియా

అప్పటికే అక్కడ ఉన్న యువతను కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు, దానికి తోడు పల్లవి ప్రశాంత్ కూడా రావడంతో అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని పోలీసులు కోరారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోమని కోరుతున్న ఒక రైతు బిడ్డకు ఇంత కూడా విలువ ఇవ్వడం లేదు తనను ర్యాలీ చేస్తూనే ఇవ్వడం లేదంటూ పల్లవి ప్రశాంత్ పోలీసుల మీద ఫైర్ అయ్యాడు. అప్పటికప్పుడు ఆయనను పంపించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది పల్లవి ప్రశాంత అభిమానులు పోలీసుల మీద దాడి చేయడం కాదు పోలీస్ వాహనాలను కూడా వంశం చేశారు. అలా జరగడానికి కారణం పల్లవి ప్రశాంత్ తమ మాట వినకుండా మళ్ళీ ర్యాలీగా రావడమేనని భావించిన పోలీసులు మామకు 9 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ మీద కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలంలోని పల్లవి ప్రశాంత్ స్వగృహానికి వెళ్లి అతన్ని అతని సోదరుడిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతానికి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక తాజాగా బిగ్ బాస్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్, మహావీరం కు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్, సోదరుడు మహావీరంకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మధ్యాహ్నం 2.30 బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.