Site icon NTV Telugu

Pakashala Pantham : రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్’ల ‘పాకశాల పంతం’ ప్రారంభం!

Pakashala

Pakashala

ప్రముఖ నటీమణులు రమ్యకృష్ణ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘పాకశాల పంతం’ నేడు (డిసెంబర్ 9, 2025) ప్రారంభమైంది. ఈ చిత్రం ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందనుంది. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రానికి ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరణ్ తుమ్మకొమ్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్‌తో పాటు ఈ సినిమాలో సంజయ్ స్వరూప్, మహత్ రాఘవేంద్ర, ఎస్.ఎస్. కాంచి, సమీరా భరద్వాజ్, రాజేష్ రాచకొండ, మాయ నెల్లూరి ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘పాకశాల పంతం’ టైటిల్ బట్టి ఈ చిత్రం వంట లేదా ఆహార నేపథ్యం కలిగిన కథాంశంతో, ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య పంతం చుట్టూ తిరిగే ఎమోషనల్ లేదా కామెడీ డ్రామాగా ఉండవచ్చని అంటున్నారు. పోస్టర్ లో కూడా వంట గది బ్యాక్ డ్రాప్ లో క్రియేట్ చేయడం గమనార్హం.

Exit mobile version