గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ను రెట్టింపు చేస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో కళల విభాగానికి గాను నందమూరి బాలకృష్ణ కు ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కు గోల్డెన్ ఎరా నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం శాసనసభ్యులుగా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ. మరోవైపు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా పేదవారికి ఎంతో సేవ చేస్తూ ఎందరో చిన్నారులను కాన్సర్ భారీ నుండి కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్నారు బాలయ్య. అలాగే సినిమాల పరంగాను తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో బ్యాక్ టు బ్యాక్ నాలుగు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు ఎవరు అందుకోలేని హిట్స్ కొడుతున్నారు బాలయ్య. వీటన్నిటితో పాటు బాలయ్య హోస్ట్ గా ఆహా లోస్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు.