NTV Telugu Site icon

OTT : చేతులు మారిన తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్.. కారణం ఇదే..

Thangalaan Ott

Thangalaan Ott

తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా వచ్చిన చిత్రం తంగలాన్. అక్కడి బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే తెరపై కళ్ళకి కట్టినట్టు తెరకెక్కించాడు దర్శకుడు పా రంజిత్.

Also Read : Nithilan Saminathan : హిట్టు కొట్టాడు.. BMW కార్ పట్టాడు..

కాగా తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ కు ముందు కొనుగోలు చేసింది.  ఇటీవల ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు  అధికారికంగా కూడా ప్రకటించారు.  దీంతో  ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ  ఆడియెన్స్  ఎదురుచూసారు. కానీ  డిజిటల్ స్ట్రీమింగ్ చేయలేదు నెట్‌ఫ్లిక్స్‌. కారణాలు మాత్రం వెల్లడించలేదు. వినిపిస్తున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ తో మేకర్స్ కు కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. తంగలాన్ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్  రద్దు చేయబోతోందన్న టాక్ వినిపిస్తుంది.  తంగలాన్ యొక్క OTT హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసింది. త్వరలో స్ట్రీమింగ్ కు తీసుకురానుడి ప్రైమ్. ఇటీవల రిలీజ్ అయ్యాక సినిమా ప్లాప్ అయితే ముందుగా అనుకున్న ధర కంటే తగ్గించి ఇస్తున్నాయి ఓటీటీ సంస్థలు. బహుశా ఇప్పుడు తంగలాన్  పరిస్థితి కూడా ఇదే కావొచ్చు.