NTV Telugu Site icon

OTT : మత్తు వదలరా -2 ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Mvlar

Mvlar

శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్  సంయుక్తంగా నిర్మించారు.

Also Read : Kiran Abbavaram : దీపావళి రేస్ లో కుర్ర హీరోకు పోటీగా ‘క ‘

థియేటర్లల్లో భారీ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ విషయమై అధికారకంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ నెల 11న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్టు ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. థియేటర్ లో 28 రోజులు రన్ తర్వాత ఓటీటీ లోకి వస్తోంది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఏ మేరకు రాణిస్తుందో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో చూడలి. దసరా కానుకగా రానున్న మత్తువదలరా -2 ను ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేసేయండి