Site icon NTV Telugu

Operation Sindoor Director Apology: క్షమాపణలు చెప్పిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ డైరెక్టర్‌.. నా ఉద్దేశ్యం అది కాదు..!

Operation Sindoor Director

Operation Sindoor Director

Operation Sindoor Director Apology: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌ చేసి పేల్చేసింది.. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఆధారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతోనే బాలీవుడ్‌ సినిమా రాబోతోంది.. దీనికి సంబంధించిన ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను అంటే ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడం.. అది కాస్తా వైరల్‌గా మారడంతో పాటు.. కొన్ని విమర్శలు కూడా మూటగట్టుకుంది.. ఆపరేషన్ సిందూర్ సినిమా ప్రకటన తర్వాత, ప్రాజెక్ట్ విడుదల సమయానికి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఇటీవల నిర్వహించిన సైనిక చర్య నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల తర్వాత కొద్దిసేపటికే విడుదలైంది.. ప్రస్తుత పరిస్థితి పట్ల సున్నితత్వం లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే, సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక ప్రకటనలో, ఈ చిత్రం వెనుక ఉద్దేశ్యం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా రెచ్చగొట్టడం కాదని దర్శకుడు ఉత్తమ్‌ మహేశ్వరి స్పష్టం చేశారు.

Read Also: Vyomika Singh : మన రాడర్ సెంటర్లను పాక్‌ టార్గెట్‌ చేసింది.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ప్రకటన

మన భారత సాయుధ దళాలు ఇటీవలి వీరోచితంగా పోరాడిన ఆపరేషన్ సిందూర్ ఆధారంగా ఒక సినిమాను ఇటీవల ప్రకటించినందుకు నా హృదయపూర్వక క్షమాపణలు.. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశ్యం కాదు అని పేర్కొన్నాడు దర్శకుడు ఉత్తమ్.. ఒక చిత్రనిర్మాతగా తన ప్రేరణను వివరిస్తూ, “మన సైనికుల ధైర్యం, త్యాగం, బలం మరియు నాయకత్వం నన్ను కదిలించాయి.. ఈ శక్తివంతమైన కథను వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే కోరుకున్నాను” అన్నారు.. ఈ ప్రాజెక్ట్ దేశం పట్ల గౌరవం, ప్రేమతో రూపొందించడింది.. అంతేకానీ, కీర్తి లేదా డబ్బు ఆర్జన కోసం కాదని పేర్కొన్నారు. అయితే, ఈ సమయంలో ఫస్ట్‌లుక్‌ విడుదల కొంతమందికి బాధ కలిగించి ఉండవచ్చని నేను అర్థం చేసుకున్నాను.. దీనిపై నేను తీవ్రంగా చింతిస్తున్నాను అన్నారు.. ఇది కేవలం సినిమా కాదు, మొత్తం దేశం యొక్క భావోద్వేగం.. ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క సామాజిక ఇమేజ్ అని చెప్పుకొచ్చారు..

Read Also: Virat Kohli: టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ?.. బీసీసీఐకి సమాచారం

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు ఉత్తమ్‌.. అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. మా ప్రేమ.. ప్రార్థనలు ఎల్లప్పుడూ అమరవీరుల కుటుంబాలతో పాటు, సరిహద్దులో పగలు మరియు రాత్రి పోరాడుతున్న యోధులతో ఉంటాయి అని ప్రకటించారు దర్శకుడు ఉత్తమ్..

Exit mobile version