Site icon NTV Telugu

Tollywood: ఒక్క క్లిక్.. అదిరిపోయే మూడు అప్‌డేట్స్.. క్లిక్ చేస్తే వావ్ అనాల్సిందే..

Untitled Design (12)

Untitled Design (12)

టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “నటీనటుల ప్రతిభకు గుర్తుగా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని  గతంలో ప్రకటించాను, అందుకు తగ్గ సలహాలు, సూచనలు ఇవ్వాలని టాలీవుడ్ పెద్దలను కోరడం జరిగింది, టాలీవుడ్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం భాదాకరమైన విషయం” అని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

బింబిసారా చిత్రంతో కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కెరీర్ లో 21వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ ను కళ్యాణ్ రామ్ ముగించాడు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో 30 రోజులపాటు ఈ యాక్షన్ సిక్వెన్స్ తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. కేవలం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం రూ. 8 కోట్ల తో భారీ సెట్లు నిర్మించారు నిర్మాతలు.

ఇటీవల మాజీ ప్రియురాలు లావణ్య కేసుల వ్యవహారంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఒకవైపు వివాదాలు, కేసులు వ్యవహారాలతో సతమతమవుతున్న ఈ హీరో మరోవైపు వరుస సినిమాలు ఆడియన్స్ ని పలకరిస్తున్నాయి. గత శుక్రవారం రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు విడుదలయింది. రాబోతున్న శుక్రవారం ‘తిరగబడారా సామి’ అనే మరో చిత్రం థియేటర్లలో దిగనుంది. కాకుంటే ఇవన్నీ ఇలా వచ్చి ఆలా వెళ్తుండడం కొసమెరుపు.

Also Read: Vikram: విక్రమ్ తంగలాన్ సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉంది అంటే.?

Exit mobile version