NTV Telugu Site icon

Release clash : మరోసారి మెగా vs అల్లు..ఈ సారి గెలుపెవరిది..?

Untitled Design (3)

Untitled Design (3)

డిసెంబరులో విడుదలయ్యే సినిమాలలో ప్రస్తుతానికి రెండు సినిమాలు క్లారిటీ ఇచ్చేసాయి. ముందుగా డిసెంబరులో వస్తున్నామని ప్రకటించారు పుష్ప -2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా సాగుతూ ఉంది. ఈ నెలలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వలన వాయిదాపడింది. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు నిర్మాతలు. కానీ షూటింగ్ డిలే కారణంగా డిసెంబరు 6న వస్తున్నట్టు ప్రకటించారు మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ.

మరోవైపు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మూడేళ్ళుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. భారతీయుడు-2 కారణంగా చరణ్ సినిమాను పక్కన పెట్టాడు శంకర్. ఇప్పుడు భారతీయుడు-2 విడుదల అవడంతో గేమ్ ఛేంజర్ ను తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నాడు. త్వరగా షూటింగ్ ముగించాలని భావిస్తోంది యూనిట్. కాగా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దీంతో 19 రోజుల గ్యాప్ లో అల్లు, మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. కానీ ఇలా ఒకే నెలలో తక్కువ గ్యాప్ లో రావడం కారణంగా పుష్ప -2 థియేటర్లను, గేమ్ ఛేంజర్ కు కేటాయించాల్సి వష్తుంది అప్పుడు సినిమా లాంగ్ రన్ పై ప్రభవం పడే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ డిసెంబరు క్లాష్ లో గెలుపెవరిదో చూడాలి.

 

Also Read: OTT : సినిమా రిలీజ్ లపై ఓటీటీ సంస్థల ఒత్తడి..కారణం ఏంటంటే..?

Show comments