Site icon NTV Telugu

Pradeep Ranganathan : మరోసారి వందకోట్ల క్లబ్ లో యంగ్ హీరో

Dragon

Dragon

జయం రవి నటించిన కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాధ్. ఆ తర్వాత హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. హీరోగా తోలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్‌‌  యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్. తాజాగా  ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.

Also Read : Tollywood : టాలీవుడ్‌లో మార్చి 7న డబ్బింగ్ చిత్రాల పోటా పోటీ రిలీజ్

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.  ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రధీప్. యూత్ ను ఆకట్టుకునే కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది.  కాగా డ్రాగన్ విడుదలైన మొదటి 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రదీప్ తొలి సినిమా లవ్ టుడే వంద  కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు డ్రాగన్ తో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడుప్రదీప్. బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలతో మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు ప్రదీప్. ఈ యంగ్ హీరో తర్వాతి సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

Exit mobile version