OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. ‘ఓం’ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?

Om Movie Box Office Collections

Om Movie Box Office Collections

OM Movie Box Office Collections: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. విడుదలైన తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం.. ఆ తర్వాతి రోజుల్లో కలెక్షన్ల పరంగా భారీ డ్రాప్‌ను ఎదుర్కొంటోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఐదు రోజుల్లో విదేశాల్లో రూ. 26 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 98.99 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. దాంతో ఓం సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకుంటుందా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది.

విడుదలైన ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి కలిపి ఓం చిత్రం మొత్తం రూ.31.77 కోట్ల గ్రాస్ వసూలు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో తమిళనాడు నుంచి రూ.30.83 కోట్ల గ్రాస్ రాగా.. పుదుచ్చేరి నుంచి రూ.94 లక్షలు వచ్చాయి. తొలి వారాంతంలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టడం చిత్ర బృందానికి సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. తమిళనాడు మార్కెట్ నుంచే సుమారు రూ.43 నుంచి రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం వచ్చిన వసూళ్లతో పోలిస్తే.. బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓం చిత్రం ఇంకా భారీ మొత్తాన్ని రాబట్టాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మళ్లీ పుంజుకుంటేనే బ్రేక్ ఈవెన్ దిశగా సినిమా ముందుకు సాగుతుంది. లేదంటే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఓం చిత్రంకు తదుపరి రోజులు అత్యంత కీలకంగా మారాయి. వీక్‌డేస్‌లో వసూళ్లు ఎలా ఉంటాయి?.. ప్రేక్షకుల ఆదరణతో సినిమా మళ్లీ పుంజుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఓం కథ సాగుతుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడ్డాయి.