Site icon NTV Telugu

‘OG’ : పవన్ కల్యాణ్ ‘OG’ లో జపనీస్ యాక్టర్..

Og

Og

రాజ‌కీయాలో బిజీగా ఉంటూనే.. ఇటు ఒప్పుకున్న సినిమాలు కూడా ఒక్కోక్కటిగా పూర్తి చేస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కొద్ది రోజుల క్రితం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు ‘ఓజీ’ చిత్రం కూడా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో  ‘గంభీర షూటింగ్ ను ముగించాడు.. ఇక ఓజీ రిలీజ్‌కు రెడీ అవుతుంది’ అంటూ మేకర్స్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక‌ ఓజీ షూటింగ్ ఫినిష్ కావ‌డంతో, మూవీ అనుకున్న టైంకి అంటే సెప్టెంబర్ 25న వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కానీ పవన్ సినిమాల రిలీజ్ విషయంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు తెలిసినవే..

Also Read : Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..

ఇక యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ క‌థానాయిక‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు.. అర్జున్ దాస్ , శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే  రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకోగా, ప‌వన్  ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా కనిపించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో జపనీస్ యాక్టర్ కెయిచి ఆండో కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా కోసం ఆయన కటనా ఫైట్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో వైరలవుతోంది.

Exit mobile version