పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న *ఓజి* సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ అభిమానులే కాదు, తెలుగు సినీ అభిమానులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టీం. అదేంటంటే, ఇప్పటివరకు లోడ్ కాని క్యూబ్ కంటెంట్ ఫైనల్‌గా లోడ్ అయినట్లుగా తెలుస్తోంది.
Also Read :Jr NTR Injury Update: డాక్టర్లకి ఎన్టీఆర్ షాక్.. రెండో రోజు షూట్?
అయినా సరే, విదేశాల్లో ఈ కంటెంట్ ఆలస్యంగా రీచ్ కావడంతో కొన్నిచోట్ల ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా, అలాగే మరికొన్ని విదేశాల్లో మాత్రం ప్రీమియర్స్ పడే అవకాశం ఉంది.
Also Read :Bangalore : భర్త తనను సుఖపెట్టడం లేదని రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన భార్య..
ఇక సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అంతేకాక, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద హైప్ పెంచేలానే ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతోందో అనేది మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
