Site icon NTV Telugu

They Call Him OG: ఓజీ డిస్ట్రిబ్యూషన్ ఒక టార్చర్.. యూరప్ డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన

Og Pawan

Og Pawan

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా, అనేక వాయిదాల అనంతరం, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కొన్ని చోట్ల ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పటికీ ఓజీ కంటెంట్ తమకు చేరలేదని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, యూరప్ డిస్ట్రిబ్యూటర్ ఫోర్ సీజన్స్ క్రియేషన్స్ ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Also Read : Rithu Chowdary : నా భర్తతో రీతూ అక్రమ సంబంధం.. సె* వీడియోస్.. హీరో భార్య సంచలనం?

చాలా కాలం నుంచి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లుగా తాము కేర్‌లెస్ కంటెంట్ డెలివరీ డిలేస్ వల్ల బాధపడుతున్నామని ప్రకటించారు. నిజానికి, ఈ రైట్స్ దక్కించుకోవడానికి ముందుగానే భారీగా డబ్బులు చెల్లించి ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దానికి మూల్యం చెల్లించుకోవడానికి అన్నట్టు, ప్రతి సినిమా కంటెంట్ లేట్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని కంప్లైంట్ చేస్తూనే, సూపర్ హైప్ తెచ్చుకున్న ఓజీ లాంటి సినిమా కంటెంట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. చివరి నిమిషం వరకు కంటెంట్ రాకపోవడంతో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కనీసం నిర్మాతలకు దీని వల్ల కలుగుతున్న నష్టం ఏంటో అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు.

Also Read : Kantara Chapter 1 Trailer: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు

ఒక పక్క థియేటర్ యాజమాన్యాల నుంచి, మరో పక్క ఫ్యాన్స్ నుంచి ఎంత ఇబ్బంది ఎదురవుతుందో, మీకు ఏమైనా అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ మీరు ఇలాగే సినిమా కంటెంట్ ఆలస్యంగా ఇవ్వాలని అనుకుంటే, మాకు సినిమాలు ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు కూడా మేము నష్టాలు భరించుకుంటూ సినిమాలు రిలీజ్ చేస్తాం. మేము భారీగా డబ్బు ఖర్చు పెట్టి ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకుంటున్నాం, కానీ ఏ ఒక్క నిర్మాత దీనికి బాధ్యత తీసుకోవడం లేదు. ఇది డిస్ట్రిబ్యూషన్ కాదు, టార్చర్. ఇకమీదటైనా సినిమా నిర్మాణ సంస్థలు, నిర్మాతలు బాధ్యత తీసుకోకపోతే, ఒకప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటూ పేర్కొన్నారు. మరో పక్క, కొన్ని ప్రాంతాలలో ప్రీమియర్స్ క్యాన్సిల్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

Exit mobile version