Site icon NTV Telugu

Kicha Sudeep : బిగ్ బాస్ హౌస్ సీజ్.. కంటెస్టెంట్లను థియేటర్ కు తరలింపు

Kichaa

Kichaa

బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతటి జనాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో బిగ్ బాస్ రియాల్టీ షో మంచి టీఆర్పీతో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ కన్నడ’.. ప్రస్తుతం పన్నెండవ సీజన్‌ ఇటీవల స్టార్ట్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Also Read : Christmas Clash : డిసెంబరు 25 రేస్ లో బెల్లం vs మేక..

కన్నడ బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేసారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. బిగ్ బాస్ హౌస్ నిర్వహణకు సరైన అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేసారు అధికారులు. కానీ బిగ్ బాస్ సీజని 12 నిర్వాహకులు ఆ నోటీసులను లెక్క చేయలేదు. అధికారులు ఇచ్చిన నోటీసులకు కనీసం స్పందించలేదు. దాంతో రంగంలోకి దిగిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు బిగ్ బాస్ హౌస్ సీజ్ చేసారు. హౌస్ సీజ్ చేయడంతో కంటెస్టెంట్లను థియోటర్ కు తరలించారు నిర్వాహకులు. హౌస్ లో ఉపయోగించిన మురుగునీరు శుద్ధి చేయకుండా చుట్టుపక్కల ప్రాంతంలోకి విడుదలవుతున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని గుర్తించారు. రెండు పెద్ద డీజిల్ జనరేటర్ సెట్లు ఆన్-సైట్‌లో 24 గంటలు పని చేస్తున్నాయి. ఇది పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంది. పర్యావరణ అనుమతులు లేవంటూ రెండు సార్లు నోటీసులు జారీచేశాముఅయినా కనీసం స్పందించకపోవడతో ఏకంగా హౌస్ ను సీజ్ చేశారు. మరి ఈ వివిధం ఎలా ముగుస్తుందో. తిరిగి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Exit mobile version