Kicha Sudeep : బిగ్ బాస్ హౌస్ సీజ్.. కంటెస్టెంట్లను థియేటర్ కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతటి జనాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో బిగ్ బాస్ రియాల్టీ షో మంచి టీఆర్పీతో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ కన్నడ’.. ప్రస్తుతం పన్నెండవ సీజన్ ఇటీవల స్టార్ట్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read : Christmas Clash : డిసెంబరు 25 రేస్ లో బెల్లం vs మేక..
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
కన్నడ బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేసారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. బిగ్ బాస్ హౌస్ నిర్వహణకు సరైన అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేసారు అధికారులు. కానీ బిగ్ బాస్ సీజని 12 నిర్వాహకులు ఆ నోటీసులను లెక్క చేయలేదు. అధికారులు ఇచ్చిన నోటీసులకు కనీసం స్పందించలేదు. దాంతో రంగంలోకి దిగిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు బిగ్ బాస్ హౌస్ సీజ్ చేసారు. హౌస్ సీజ్ చేయడంతో కంటెస్టెంట్లను థియోటర్ కు తరలించారు నిర్వాహకులు. హౌస్ లో ఉపయోగించిన మురుగునీరు శుద్ధి చేయకుండా చుట్టుపక్కల ప్రాంతంలోకి విడుదలవుతున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని గుర్తించారు. రెండు పెద్ద డీజిల్ జనరేటర్ సెట్లు ఆన్-సైట్‌లో 24 గంటలు పని చేస్తున్నాయి. ఇది పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంది. పర్యావరణ అనుమతులు లేవంటూ రెండు సార్లు నోటీసులు జారీచేశాముఅయినా కనీసం స్పందించకపోవడతో ఏకంగా హౌస్ ను సీజ్ చేశారు. మరి ఈ వివిధం ఎలా ముగుస్తుందో. తిరిగి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!