Site icon NTV Telugu

Nagavamsi : ఇట్స్ అఫీషియల్.. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలివే..

Nagavamshi Trivikram

Nagavamshi Trivikram

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎప్పుడు తారా స్థాయిలో ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ తదుపరి సినిమాల పై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రొడ్యూసర్ నాగవంశీ వాటికి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగవంశీ తన ట్విటర్ ద్వారా.. ‘ఇట్స్ అఫీషియల్… త్రివిక్రమ్ తదుపరి రెండు సినిమాలు ఇప్పటికే లాక్ అయ్యాయి. వాటిలో ఒకటి వెంకటేష్ గారితో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ తో. త్రివిక్రమ్ పేరుతో వేరే హీరోల గురించి వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలు మాత్రమే’ అని పేర్కొన్నారు.

Also Read : Surekha Vani : సురేఖా వాణి టాటూ వివాదం.. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్..

ఈ ప్రకటనతో త్రివిక్రమ్ అభిమానుల్లో నెలకొన్న అనేక సందేహాలకు చెక్ పడింది. ప్రత్యేకంగా వెంకటేష్, ఎన్టీఆర్‌లతో ఆయన రూపొందించనున్న సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ కలిగిన స్టార్లు కావడం వల్ల, ఈ సినిమాల పై అటు ఇండస్ట్రీలోను, ఇటు ప్రేక్షకుల్లోను భారీ ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ స్టైల్‌లో వినోదం, భావోద్వేగం, క్లాస్-మాస్ మిక్స్ ఉండే ఈ రెండు ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయనే దాని పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version