Nagavamsi : ఇట్స్ అఫీషియల్.. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎప్పుడు తారా స్థాయిలో ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ తదుపరి సినిమాల పై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రొడ్యూసర్ నాగవంశీ వాటికి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగవంశీ తన ట్విటర్ ద్వారా.. ‘ఇట్స్ అఫీషియల్… త్రివిక్రమ్ తదుపరి రెండు సినిమాలు ఇప్పటికే లాక్ అయ్యాయి. వాటిలో ఒకటి వెంకటేష్ గారితో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ తో. త్రివిక్రమ్ పేరుతో వేరే హీరోల గురించి వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలు మాత్రమే’ అని పేర్కొన్నారు.
Also Read : Surekha Vani : సురేఖా వాణి టాటూ వివాదం.. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్..
Also Read
ఈ ప్రకటనతో త్రివిక్రమ్ అభిమానుల్లో నెలకొన్న అనేక సందేహాలకు చెక్ పడింది. ప్రత్యేకంగా వెంకటేష్, ఎన్టీఆర్‌లతో ఆయన రూపొందించనున్న సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ కలిగిన స్టార్లు కావడం వల్ల, ఈ సినిమాల పై అటు ఇండస్ట్రీలోను, ఇటు ప్రేక్షకుల్లోను భారీ ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ స్టైల్‌లో వినోదం, భావోద్వేగం, క్లాస్-మాస్ మిక్స్ ఉండే ఈ రెండు ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయనే దాని పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.
— Naga Vamsi (@vamsi84) June 12, 2025
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!