NTV Telugu Site icon

Officer on Duty: 12 కోట్లతో సినిమా తీస్తే 4 రోజుల్లో 25 కోట్లు

Officer On Duty

Officer On Duty

కోట్లు పెట్టి సినిమాలు చేయనక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అవే కోట్లు వచ్చి పడతాయ్ అని నిరూపిస్తోంది మాలీవుడ్. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న మల్లూవుడ్.. మరోసారి ఇదే జోనర్ చిత్రాలు తీసి హిట్స్ అందుకుంటుంది. జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే ఫ్లోలో ఉంది. మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కుంచాకో బోబన్ నుండి వచ్చిన సినిమానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఫిబ్రవరి 20 రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పటి వరకు 25 క్రోర్ కలెక్షన్స్ రాబట్టుకుని.. ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. రూ. 12 కోట్ల పెట్టి తెరకెక్కిస్తే.. నాలుగు రోజుల్లోనే పిక్చర్ ప్రాఫిట్ చూసింది.

Pakistan: పాక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..!

ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీని జీతూ అస్రఫ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో ప్రియమణి ఫీమేల్ లీడ్‌లో నటించింది. ఏడాదిగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న కుంచాకో బోబన్.. ఈ సినిమాతో ట్రాక్ ఎక్కినట్లు కనిపిస్తున్నాడు. పద్మిణీ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమౌతున్నాడు కుంచకో బొబన్‌. అతనికి హిట్టు ఇచ్చి లక్కీ లేడీగా మారింది ప్రియమణి. వచ్చే నెల వరకు సినిమాకు పోటీగా పెద్ద హీరోల పిక్చర్స్ లేకపోవడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం అనుకుంటే కాదు గానీ.. కేరళ ఆడియన్స్ ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం.