NTV Telugu Site icon

SSRMB : SSMB 29 పై ఒడిశా డిప్యూటీ సీఎం కామెంట్స్

Ssmb

Ssmb

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ రోల్ లో కనిపిస్తోంది.

Also Read : RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నార్త్ లోని ఒడిశా రాష్ట్రంలో అవుట్ డోర్ లో జరుగుతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ నుద్దేశించి ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘గతంలో మల్కాన్‌గిరిలో పుష్ప-2, ఇప్పుడు ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రాబోయే చిత్రం SSMB29. టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు మరియు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రాతో కలిసి కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఒడిశాలో సినిమా షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌ల సంపద ఉందని రుజువు చేస్తుంది. ఒడిశా పర్యాటక రంగానికి చాలాపెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రకాల ప్రధాన షూటింగ్స్ కు ఒడిశా గమ్యస్థానంగా మారుతుంది. ఒడిశా పొటెన్షియల్ ను ఎక్స్ ప్లోర్ చేసేందుకు అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వాగతిస్తున్నాము అలాగే షూటింగ్స్ కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాము’ అని ట్వీట్ చేసారు.