Site icon NTV Telugu

Crime News: బుల్లితెర నటి ఆత్మహత్య..! సూసైడ్ నోట్‌లో..

Rashmi Rekha

Rashmi Rekha

సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస మ‌రణాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ ఆత్మహత్య మ‌రువ‌క‌ముందే.. సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్‌ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా ‘ఐ లవ్‌ యూ సాన్’ అని రాసుకొచ్చింది. అయితే 23 ఏళ్ల రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్‌ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ‘శనివారం (జూన్‌ 18) రష్మీకి కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్‌ మాకు చెప్పాడు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదు.’ అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ ‘కెమిటి కహిబి కహా’ అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

VishnuVardhan Reddy: వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు

Exit mobile version