NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Exclusive: యంగ్ హీరో సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’. పడవ పందేల నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో హీరో సుహాస్ ‘మండాడి’ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మండాడి’ క్లైమాక్స్ మొత్తాన్ని దాదాపు 45 రోజుల పాటు సముద్రంలోనే చిత్రీకరించినట్లు సుహాస్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సముద్రంలోకి వెళ్లి.. సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్లమని చెప్పారు. సముద్రంలో షూటింగ్ చేయడం అంత సులభం కాదని, ఎన్నో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నామని వెల్లడించారు.
షూటింగ్ సమయంలో బోట్లు తిరగబడటం వంటి ప్రమాదాలు చాలాసార్లు ఎదురయ్యాయని సుహాస్ తెలిపారు. అలాంటి సందర్భాల్లో నాలుగైదు సార్లు దాదాపుగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. “ఇక అయిపోయాం అనుకున్నాం” అంటూ ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. సముద్రంలో 45 రోజుల పాటు షూటింగ్ చేయడం తన కెరీర్లోనే అత్యంత రిస్క్‌తో కూడుకున్న అనుభవమని సుహాస్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి లైఫ్ రిస్క్ చేసే సినిమాలు చేయనని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ‘మండాడి’ కోసం తాము పడిన కష్టం, ఎదుర్కొన్న సవాళ్లు వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని ఆయన చెప్పారు. కాగా.. ‘మండాడి’ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘మండాడి’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌లోని బోట్ సీక్వెన్స్, పడవ పందేల సన్నివేశాలు, యాక్షన్, ఎమోషన్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..