NTR-Japan Fan: ఎన్టీఆర్ క్రేజ్.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు జపనీస్ ఫ్యాన్స్!

  • ఖండాంతరాలు దాటిన తెలుగు సినిమా ఖ్యాతి
  • ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు
  • సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు జపనీస్ ఫ్యాన్స్
South India Shopping Mall Ntr

South India Shopping Mall Ntr

తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటిన విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు విదేశాల్లో కూడా క్రేజీ కలెక్షన్స్ రాబట్టాయి. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లకు గ్లోబల్ ఫాన్స్ భారీగా ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం సినిమాలే కాదు.. టైగర్ చేసే యాడ్స్ (ప్రకటనలు) కూడా విదేశీయులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఒక జపనీస్ అభిమాని ఎన్టీఆర్ పట్ల తనకున్న ప్రేమని చాటుకుంటూ.. హైదరాబాద్‌లోని ‘సౌత్ ఇండియా’ షాపింగ్ మాల్‌ను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆ సంస్థ కోసం చేసిన యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చూసి ఇన్స్‌పైర్ అయిన ఒక జపనీస్ కస్టమర్.. కేవలం షాపింగ్ కోసమే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను విజిట్ చేశారు. తమకు నచ్చిన డ్రెస్సులను కొనుగోలు చేశారు. ఎన్టీఆర్‌ యాడ్ చూసే ఇక్కడకు షాపింగ్ చేయడానికి వచ్చానని, ఇది తన జీవితంలో మంచి అనుభవం అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాండ్ అంటే అది నమ్మకానికి మారుపేరు అని సదరు అభిమాని అభిప్రాయపడటం విశేషం.

Also Read: ICC Pre-Seeding Rule: అగ్రస్థానంలో నిలిచిన టీమ్స్ అన్నీ గ్రూప్‌-1లోనే.. ఎందుకో తెలుసా?

ఈ సంఘటన ‘గ్లోబల్ ఫ్యాన్స్.. గ్లోబల్ లవ్’ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మన తెలుగు హీరోల రేంజ్ ఎంతలా పెరిగిందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. అదే సమయంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌తో కస్టమర్లకు ఉన్న బలమైన కనెక్షన్‌ను కూడా ఇది స్పష్టం చేస్తోంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మేనియా కేవలం థియేటర్లకే పరిమితం కాదని.. అది బిజినెస్ బ్రాండ్లను కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఈ విదేశీ అభిమాని నిరూపించారు.