శీతాకాలంలో కన్నడ భామ రుక్మిణి వసంత కాలం నడుస్తుంది. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతారా ప్రీక్వెల్ తో పాటు తమిళ స్టార్ హీరో శివకారికేయం మురుగదాస్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందిల. ఇక లేటెస్ట్ గా యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రుక్మిణి వసంత్.
Also Read : AlluArjun : పుష్ప -2 హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్టే.. కారణం ఇదే..?
ఈ విషయమై గతంలో ఈ భామను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అలాంటిది లేద్జు అనే సమాధానము ఇచ్చింది. ఇప్పుడు తారక్ సినిమాకు సైన్ చేసింది ఈ కన్నడ కుట్టి. ఇటీవల ఇందుకు సంబందించి అగ్రిమెంట్స్ కూడా ఫినిష్ చేశారట మేకర్స్. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని రోజల క్రితం పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అటు తారక్ కూడా వార్ -2 షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇటు తెలుగు, తమిళ్. కన్నడ సినిమాలతో రుక్మిణి రూలింగ్ నడుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ రావడంతో అమ్మడు ఆనందంలో మునిగి తేలుతోంది. తన నటనతో అదరగొట్టే రుక్మిణి రాబోయే ఎన్టీఆర్ సినిమాలో ఎటువంటి క్యారక్టర్ పోషించనుందో కొద్దీ రోజులు ఆగితేగాని క్లారిటీ రాదు.