జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్-ఇండియా లెవెల్ స్టార్. ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ, వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. త్వరలోనే ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్‌లాంటి స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. కానీ, ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక దశలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడ్డ కాలం ఉంది.
Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ఓటిటి డేట్ లాకయ్యిందా?
‘శక్తి’ నుంచి ‘రభస’ వరకు ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. వరుసగా ప్రాజెక్టులు సైన్ చేయడం వల్లే ఆ ఫలితాలు వచ్చాయని అప్పట్లో ఇండస్ట్రీ టాక్. ఈ అనుభవం తర్వాత ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ అంగీకరించే విధానాన్ని అనుసరించాడు. ఈ క్రమంలో కొన్ని మంచి కథలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. వాటిలో ఒకటి ‘శ్రీనివాస కళ్యాణం’.. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఈ కథను సిద్ధం చేశాడు. కథ విన్న ఎన్టీఆర్‌కి కూడా నచ్చింది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అని అందరూ అనుకున్నారు. అయితే, ఎన్టీఆర్ కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇదే సమయంలో నిర్మాత దిల్ రాజు, ఆ కథను మిడ్-రేంజ్ హీరోతో చేయాలని నిర్ణయించి, నితిన్‌తో చిత్రాన్ని పూర్తి చేశారు. కథలో మంచి పాయింట్ ఉన్నా, స్క్రీన్‌ప్లే లోపం కారణంగా ‘శ్రీనివాస కళ్యాణం’ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇలా ఒక మంచి కథలో ఎన్టీఆర్ తప్పించుకో గా, నితిన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బుక్కైపోయాడు.
