NTRNEEL : నందమూరి ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్

Ntrneel

Ntrneel

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ను మే 19 అర్ధరాత్రి విడుదల చేయబోతున్నారు. పుట్టినరోజు వేడుకలను ఒక రోజు ముందుగానే ప్రారంభించేలా అర్ధరాత్రి నుండే సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్ తో పాటు డ్రాగన్ టైటిల్‌ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 జూన్ 11న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్‌తోనే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో తన బాక్సాఫీస్ సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు.