ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకుంది. ఇక నితిన్ తారక్‌కి సొంత బామ్మర్ది అనే విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా నితిన్ గురించి తారక్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
Also Read: NTR : అదుర్స్ 2 అంటే భయం వేస్తుంది..
‘నాకు 2011 లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. నాతో మాట్లాడటానికి కూడా భయపడేవాడు. నేను వస్తున్నా అంటే అక్కడి నుంచి జంప్ అయ్యేవాడు.. నేను మాట్లాడడానికి ట్రై చేసినా నాకు ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. అంత మొహమాటం భయం నేను అంటే. అలాంటి నితిన్ మొదటి సారిగా నాతో ధైర్యం చేసి చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని.. నీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాను. నా సపోర్ట్ మాత్రం ఉండదు అని అన్నాను. అన్నట్లుగానే నా అభిప్రాయం లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు. అలాగే ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని తెలిపాడు.