ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ కలగలిస్తే ఎలా ఉంటుందో ‘డ్రాగన్’ సినిమాతో చూపించబోతున్నారు. తారక్‌కి జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే మే 20న తారక్ పుట్టినరోజున సరిగ్గా అర్ధరాత్రి సమయంలో గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఈ గ్లింప్స్ విడుదల సమయం వెనుక ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ దాగి ఉందని సమాచారం.
తారక్ తన కార్ నెంబర్ల ఇతర ముఖ్యమైన విషయాల వరకు 9 (తొమ్మిది) అంకెను తన లక్కీ నెంబర్‌గా భావిస్తారనే సంగతి తెలిసిందే. అందుకే, ప్రశాంత్ నీల్ టీమ్ గ్లింప్స్ సమయాన్ని కూడా అదే వచ్చేలా ప్లాన్ చేశారట. లేటెస్ట్ బజ్ ప్రకారం.. సరిగ్గా మే 20 అర్ధరాత్రి 12 గంటల 06 నిమిషాలకు (1+2+0+6 = 9) ఈ సాలిడ్ గ్లింప్స్‌ను వదలనున్నట్లు తెలుస్తోంది. ఈ టైమింగ్‌తోనే తారక్ మాస్ జాతర మొదలవ్వబోతోందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. దీనిపై అధికారిక క్లారిటీ మరికొద్ది గంటల్లో వచ్చే అవకాశం ఉంది.
