సినీనటుడు, వైకాపా మాజీ నేత ఆలీకి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ శాఖ నోటీసులు జారీ చేసింది. మండలంలోని ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా అలీ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అలీకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పంచాయతీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు చేపడుతున్నారని పేర్కొన్నన్నారు . ఈ అక్రమ నిర్మాణాలకు సంబందించి అలీకి ఈ నెల 5న ఓ సారి నోటీసు ఇవ్వగా ఎటువంటి వివరన ఇవ్వలేదు, దాంతో తాజాగా మరోసారి నోటీసు అందజేశారు.
ఆలీకి చెందిన వారు ఎవరు అందుబటులో లేకపోవడంతో అక్కడే ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి గ్రామ సెక్రెటరీ శోభారాణి నోటీసులు అందించారు. ఫామ్‌హౌస్ చేపడుతున్న నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు.ఫామ్‌హౌస్ కు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించి సరైన అనుమతులు పొందాలని సూచించారు. అటు లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అలీ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరి నోటీసులపై అలీ స్పందిస్తారో లేదో చూడాలి.