NTV Telugu Site icon

Rashmika Mandanna: హీరోయిన్‌ అవ్వడానికి ఒక్క రాత్రి సరిపోదు..!

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇప్పుడు ఈ లేడీని నేషనల్ క్రష్ అని పిలుస్తారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో “నా సామి” సాంగ్‌ ఒక రేంజ్ లో హిట్ కొట్టింది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ, వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది.

read also: Rakesh Jhunjhunwala: “ఇండియా వారెన్ బఫెట్” ఇక లేరు.. రాకేష్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం

ప్రస్తుతం చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే రష్మిక మందన్న ఎంత క్రేజ్ తెచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రష్మికను చూసి ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. ఆమె అదృష్టం బాగుండి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని హైలైట్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రష్మిక మందన్న తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. హీరోయిన్ గా ఎదగడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడో వింటే మీరు కూడా షాక్ అవుతారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…’ హీరోయిన్ గా గుర్తింపు పొందటానికి తాను పడిన కష్టాల గురించి వెల్లడించింది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదని వెల్లడించింది.

స్టార్‌ స్థాయికి చేరుకోవడానికి ఏడేళ్లు కష్టపడ్డానని తెలిపారు. అందరూ అంటున్నట్లు నేను అదృష్టాన్ని వెంటపెట్టుకొని తిరగలేదని పేర్కొంది రష్మిక. ఏడేళ్లుగా ఎన్నో బాధలను దిగమింగానని, ఎన్నో త్యాగాలు చేస్తేనే ఇప్పుడు ఈస్థాయికి చేరుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అందరూ అంటున్నట్లు ఒక నైట్ లో నేను హీరోయిన్ అయిపోలేదని రష్మిక చెప్పుకొచ్చారు. హీరోయిన్ అవ్వటానికి ఎంతో ఓర్పు, పట్టుదల, సహనం ఉండాలి. హీరోయిన్ అవ్వటానికి ఒక్క రాత్రి సరిపోదు ‘ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇప్పుడు రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నిజమోకదా మరి ఆమె ఏడేళ్లు కష్టపడి స్టార్‌ హీరోయిన్‌ స్థానాన్ని సంపాదించుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారట.
Komaram Bheem Asifabad: విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం