NTV Telugu Site icon

Prabhas kalki: ఎట్టకేలకు దిగొచ్చిన కల్కి..!

Untitled Design

Untitled Design

రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రెండవ వారంలోను స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 950కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్లు వైపు పరుగులు పెడుతోంది కల్కి. కాగా కల్కి రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్ లు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం.

రెండు తెలుగు రాష్టాలలోను ఈ వెసులుబాటు దక్కింది కల్కి చిత్రానికి. అత్యధిక థియేటర్లు, టికెట్ అధిక ధరలు అమ్మడంతో డే -1 మంచి నంబర్లు కనిపించాయి. ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాస్ లో ఆ ప్రభావం బాగా కనిపించింది.  అయితే కల్కి సినిమాకు రేట్లు మరీ ఎక్కువగా పెంచారని కొంతవ్యతిరేకత వచ్చింది. మొదటి వారం ఫాన్స్, సెలవలు రావడం, పాజిటివ్ టాక్ తో అధిక ధర వెచ్చించి చూసారు. కానీ సినిమా లాంగ్ రన్ అవ్వాలంటే, స్టడీ కలెక్షన్స్ ఉండాలంటే టికెట్ రేట్లు సాధారణంగా ఉండడం తప్పని సరి. కల్కి సినిమాకు మంచి టాక్ రావడం, ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం కల్కి లాంగ్ రన్ కు కలిసొచ్చే అంశం. కలెక్షన్స్ ఎక్కడ డిప్ అవ్వకుండా ఉండాలనే  విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్ల తగ్గించి సాధారణ రేట్ కు తీసుకువచ్చారు. తగ్గించిన టికెట్ రేట్ల కలిసొచ్చే అంశంగా భావిస్తోంది యూనిట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ  ఆడియెన్స్ కదిలి వస్తారని భావిస్తోంది. చూడాలి మరి కల్కి సినిమా ఇక నుండి ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో