NTV Telugu Site icon

Bollywood : సిల్వర్ స్క్రీన్ వద్దు.. ఓటీటీ ముద్దు అంటోన్న స్టార్ కిడ్స్

Bollywood

Bollywood

బాలీవుడ్ లో కొత్త తరం యాక్టర్ల హవా స్టార్టైంది. అమితాబ్, షారూఖ్, అమీర్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నెపోటిజం అన్నా నెపో కిడ్స్ అన్నా ఎక్కడా ఈ ఒరవడి ఆగట్లేదు. అయితే నేరుగా సిల్వర్ స్రీన్ పైకి రావడానికి తాము యాక్టింగ్ కు సెట్ అవుతామా లేదా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఓటీటీ ప్రేక్షకుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు లవ్యాపాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెడుతుంటే అంతకు ముందే ఓటీటీలో మహారాజ్ తో డిజిటల్ ప్రేక్షకులకు టెస్ట్ పెట్టాడు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

జునైద్ ఖాన్ కన్నా ముందే ఓటీటీ తలుపులు తట్టారు అమితాబ్ మనవడు అగస్త్య నంద, బోనీ కపూర్ చిన్న తనయ ఖుషీ కపూర్, షారూఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్. ద ఆర్చిస్ మూవీతో ఈ ముగ్గురు యాక్టింగ్ కెరీర్ గురించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ ఓకే అనిపించుకున్నాక ఇప్పుడు బిగ్ స్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్నారు. అగస్త్య ఇక్కిస్, ఖుషీ లవ్యాపా, సుహానా..తండ్రి షారూఖ్ అప్ కమింగ్ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తున్నారు. తమ కొలిగ్స్, ఫ్రెండ్స్ పిల్లలు ఓటీటీ బాట పడుతుంటే నా కొడుకు ఎందుకు సిల్వర్ స్రీన్ పైకి అనుకున్నాడేమో సైఫ్ తన కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ను కూడా డిజిటల్ ఎంట్రీకి ప్రిపేర్ చేశాడు. ఇబ్రహీం హీరోగా వస్తోన్న ‘నాదానియా’ కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఖుషీ కపూర్ హీరోయిన్. నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానుంది.