Site icon NTV Telugu

July Movies : సినిమాలు లేక.. ఖాళీగా దర్శనమిస్తోన్న థియేటర్స్

Tollywood

Tollywood

జులై మొదలవడంతోనే నిరాశపరిచింది. గత వారం వచ్చిన నితిన్ తమ్ముడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయి డిస్ట్రిబ్యూటర్స్ ను నిండా ముంచేసింది. కొన్ని ఏరియాలలో సాయంత్రం షోస్ కూడా పడలేదంటే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక నవీన్ చంద్ర షో టైమ్ పరిస్థితి కూడా ఇంతే. కాకుండా ఈ సినిమాను కేవలం లిమిటెడ్ థియేటర్స్ లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేయడం వలన ఎవరికీ నష్టాలు ఏమి లేవుకానీ థియేటర్స్ షోస్ కూడా పడని పరిస్థితి.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే

ఇక ఈ వారం కూడా పరిస్థితి దాదాపు ఇంతే. సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ ఈ  రోజు థియేటర్స్ లో విడుదలవుతోంది. వారానికి ఓ సినిమాతో వస్తున్న సుహాస్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ సినిమాకు బజ్ అంతగా ఏమి లేదు. ట్రైలర్ కూడా అంతంత మాత్రమే. ఇక చక్రవాకం సీరియల్ తో గుర్తింపు తెచుకున్న ఆర్కే నాయుడు నటించిన చిత్రం 100. రెండు రోజుల ముందుగా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించిన ఈ సినిమా వస్తున్నట్టు తెలీదు. సినిమాకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చాలా వీక్ గా చేసారు. ఈ రెండిటితో పాటు వర్జిన్ బాయ్స్ అనే సినిమా కూడా నేడు రిలీజ్ అవుతుంది. కేవలం ఓటీటీ కోసమే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నట్టు ఉంది ఈ సినిమా. ఈ మూడు సినిమాలు లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. స్టార్స్ సినిమాలు ఏమి లేక థియేటర్స్ లు ఖాళీగా ఉంటున్నాయి. చిన్న సినిమాల వలన థియేటర్స్ ఓనర్స్ కు కనీసం రెంట్ ఖర్చులు కూడా రావడం లేదు.

Exit mobile version