NTV Telugu Site icon

August Release: ఎవరొచ్చినా రాకున్న సరే ఆ సినిమా తగ్గేదేలే..ఏమిటా సినిమా..!

Untitled Design (1)

Untitled Design (1)

పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాల రిలీజ్ అనేది కొంత రిస్క్ అయినా సరే టాక్ బాగుంటే మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స ఉంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లేదా లాంగ్ వీకెండ్ హాలిడే నాడు రెండు మూడు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న బడ్జెట్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఆ చిన్న సినిమాకు సపోర్ట్ గా పెద్ద బ్యానర్ లేదా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడం లేదా కంటెంట్ మీద నమ్మకం అయినా అయిండొచ్చు.

ఇదిలా ఉండగా రానున్న ఆగస్టు 15 హాలీడే తో పాటు లాంగ్ వీకెండ్ కలిసి రానుండడంతో 4 సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నైజాంలోమైత్రీ లాంటి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఉండడం కలిసొచ్చే అంశం. ఇదే కోవలో రానున్న మరో బిగ్ బుడ్జెట్ సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని కూడా నైజాంలో మైత్రీ మూవీస్ రిలీజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక విక్రమ్ నటించిన తమిళ సినిమా తంగలాన్ కూడా మైత్రీనే విడుదల చేయడం గమనార్హం.

మూడు భారీ బడ్జెట్, భారీ హైప్ ఉన్న చిత్రాల మధ్య ఓ చిన్న సినిమా రానుంది. నార్నె నితిన్ హీరోగా గీత ఆర్ట్స్-2 నిర్మించిన ‘ఆయ్’. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఆగస్టు 15న పక్కాగా వస్తామని పోస్ట్ పోన్ చేసేఛాన్స్ లేదని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. టాక్ బాగుంటే మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

 

Show comments