Site icon NTV Telugu

Mass Jathara : సప్పుడు చాలట్లేదు!

Mass Jathara

Mass Jathara

‘ధమాకా’ లాంటి హిట్ అందుకుని రవితేజకి చాలా కాలమే అయింది. వరుస సినిమాలు ఆయన నుంచి వస్తూనే ఉన్నా, సాలిడ్ హిట్ మాత్రం పడట్లేదు. ఇప్పుడు ఆయన హీరోగా, భాను భోగవరపు అనే దర్శకుడు పరిచయమవుతున్న సినిమా ‘మాస్ జాతర’. నాగ వంశీ బ్యానర్‌లో రూపొందించబడిన ఈ సినిమా, పలు సార్లు వాయిదా పడుతూ, ఎట్టకేలకు ఈ నెల చివరి రోజైన అక్టోబర్ 31వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే, సరిగ్గా మాట్లాడుకోవాలంటే, ఆ సినిమా రిలీజ్‌కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. కానీ, రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాకి కనిపించే బజ్ మాత్రం ఈ సినిమాకి కనిపించట్లేదు.

Also Read : Telugu Films: ఇక అలాంటి సినిమాలు రాసే డైరెక్టర్‌లకు రక్త కన్నీరే!

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి సాలిడ్ బజ్ ఏర్పడే కంటెంట్ ఒకటి రిలీజ్ కాలేదు. టీమ్ ఒక కామన్ ఇంటర్వ్యూ చేసి వదిలింది, కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి, మాస్ మహారాజా రవితేజ లాంటి హీరో చేస్తున్న సినిమా సప్పుడు అంటే ఒక రేంజ్‌లో ఉండాలి. దానికి తోడు, ‘మాస్ జాతర’ లాంటి మాస్ టైటిల్ పెట్టుకున్న సినిమా ఇంత సైలెంట్ ప్రమోషన్స్‌తో ముందుకు వెళ్లడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి, ఈ సినిమా బజ్‌కి నాగవంశీ కరెక్ట్‌గా సూట్ అవుతారు.

Also Read :Deepika Padukone: హీరో, హీరోయిన్ ఒక్కటేనా? దీపికా!

అయితే, ‘వార్ 2’ రిజల్ట్ తేడా పడితే, ఇక సినిమాలు గురించి పెద్దగా మాట్లాడను అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే, ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆయన గట్టిగా ప్రమోషన్స్ చేస్తారా, చేయరా అనే అనుమానాలు వ్యక్తం చేసేలా చేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ప్రస్తుతానికి ఈ సినిమాకి ఉన్న బజ్ సరిపోవడం లేదు. నాగవంశీ లేదా రవితేజ నేరుగా రంగంలోకి దిగితే తప్ప, ఈ సినిమాకి బజ్ ఏర్పడే పరిస్థితి లేదు. మరి చూడాలి, స్వయంగా నాగవంశీ రంగంలోకి దిగుతారో లేక రవితేజను దింపుతారో అనేది.

Exit mobile version