Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rukmini Vasanth: మలయాళ సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో నివిన్ పౌలీ, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తొలిసారి జంటగా నటిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి నషీద్ ఫమీ దర్శకత్వం వహిస్తుండగా.. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో చిత్ర బృందం, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నివిన్ పౌలీ, రుక్మిణి వసంత్‌కి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాతో రుక్మిణి వసంత్ మలయాళ చిత్రసీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే తన నటనతో భాషలకు అతీతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నివిన్ పౌలీతో కలిసి తొలిసారి మలయాళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు నటుడు అజు వర్గీస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫ్రెష్ కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నివిన్ పౌలీ – రుక్మిణి జోడీని చూసిన అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ జోడిపై ‘క్యూట్’, ‘డ్రీమీ కాంబినేషన్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
Also Read
- Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
- Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
తాజావార్తలు
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!